![]() |
![]() |

బుల్లితెర మీద క్యూట్ కపుల్ షో "లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్" ప్రతీ వారం సరదాసరదాగా సాగిపోతోంది. హోస్ట్ ప్రదీప్ కూడా నాటీ జోక్స్ తో అందరినీ అలరిస్తున్నాడు. ఈ వారం షోకి రియల్ కపుల్స్ నమిత-వీరేంద్ర, సామ్రాట్ - అంజనా, యస్వంత్ మాస్టర్ - వర్షా వచ్చి ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేశారు. ఈ ఎపిసోడ్ "క్రేజీ లవ్ ప్రొపోజల్స్" పేరుతో ఒక టాస్క్ ఇచ్చాడు ప్రదీప్. వెరైటీ ప్రాపర్టీస్ ని వాడి వాళ్ళ వాళ్ళ లవ్ ని ఎక్ష్ప్రెస్స్ చేయాలని చెప్పాడు. ముందుగా యష్ మాస్టర్-వర్షాని స్టేజి మీదకు పిలిచి జండూబామ్ బాటిల్ ఇచ్చి లవ్ ప్రొపోజ్ చేయమని చెప్పాడు.
"ఎంత ఘాటుగా ఉందో నా ప్రేమలాగా , నా లైఫ్ కి పేరుంటే అది నువ్వే నా జండూబామ్" అని చెప్పి వెరైటీగా ప్రొపోజ్ చేసాడు. తర్వాత సామ్రాట్-అంజనాని పిలిచి సామ్రాట్ చేతికి కొబ్బరికాయ ఇచ్చి లవ్ ప్రొపోజ్ చేయమన్నాడు. "ఈ కొబ్బరికాయ ఎంత స్ట్రాంగో మన బంధం కూడా అంతే స్ట్రాంగ్..ఈ కొబ్బరి చెట్టుకు దొరికిన కొబ్బరికాయ లాంటి దానివి..ఇక ఫైనల్ గా నమిత-వీరేంద్ర జంటను స్టేజి మీదకు పిలిచి పచ్చిమిర్చి ఇచ్చి లవ్ ప్రొపోజ్ చేయమన్నాడు. "ఈ మిర్చి స్పైసిగా కాసేపే ఉంటుంది. కానీ నువ్వు నా లైఫ్ టైం స్పైసీ" అని చెప్పి లవ్ ప్రొపోజ్ చేసాడు.
![]() |
![]() |